
హేళన చేశారు.. ఆ కసితోనే చదివా
– పిల్లి ప్రణయ్‌కుమార్, ఎస్‌హెచ్‌వో, మావల
కుటుంబ నేపథ్యం..: మాది నిజామాబాద్ జిల్లా భీంగల్. నాన్న సత్యనారాయణ వ్యాపారవేత్త, అమ్మ నర్సు గృహిణి. అన్నయ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అక్కకు పెళ్లయింది. నేను చివరి సంతానం.
విద్యాభ్యాసం: పదో తరగతి వరకు ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. ఇంటర్ కూడా భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే పూర్తి చేశా. ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను.
లక్ష్యసాధన: డిగ్రీ పూర్తి కాగానే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నా. అందులో భాగంగా పోలీస్ కొలువును ఎంచుకున్నా. ప్రిపేర్ అవుతున్న క్రమంలో కొంతమంది ‘ఏం ఉద్యోగం సాధిస్తావని’ హేళన చేశారు. అదే నాలో కసిని పెంచింది. దీంతో పట్టుదల పెరిగింది. ఉద్యోగం సాధించి వారికి సమాధానం చెప్పా.
సమాజంలో మీరు కోరుకునే మార్పు..: తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. వారి లక్ష్యసాధనలో వెన్నంటి నిలవాలి.
నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: ప్రణాళికాబద్ధంగా చదివితే సర్కారు కొలువు సాధించడం సులువే.