● ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ● నిబంధనలు పాటించలేదంటున్న పలు ఏజెన్సీల నిర్వాహకులు ● రద్దు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు ● నేడు దరఖాస్తుకు చివరి తేది | - | Sakshi
Sakshi News home page

● ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ● నిబంధనలు పాటించలేదంటున్న పలు ఏజెన్సీల నిర్వాహకులు ● రద్దు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు ● నేడు దరఖాస్తుకు చివరి తేది

May 13 2025 12:10 AM | Updated on May 13 2025 12:10 AM

● ఔట్

● ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్‌పై అభ్య

సాక్షి, ఆదిలాబాద్‌: కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కొంత మంది ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాహకులు కలెక్టర్‌ను కలిశారు. నూతన ఎంప్యానల్‌మెంట్‌ ఏర్పాటు కోసం ఇటీవల విడుదల చేసిన టెండర్‌ నోటిఫికేష న్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవో 4459 ప్రకా రం నిబంధనలు జారీ చేయాల్సి ఉండగా, ఆ జీవో ను బేఖాతరు చేస్తూ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేశారని, అందులో అడ్డగోలు నిబంధనలు పెట్టడంతో అనేక ఏజెన్సీలకు కనీసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఉందని వాపోయారు. ఇది కేవలం ప్రస్తు తం కొనసాగుతున్న కొన్ని ఏజెన్సీలకు మేలు చేసే లా నోటిఫికేషన్‌ రూపొందించినట్లు ఆ నిర్వాహకులు నేరుగా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దరఖాస్తుకు మంగళవారం తుది గడువు కావడంతో ఆ నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరారు. నిబంధనల ప్రకారం కొత్తది జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కలెక్టర్‌ ప్రజావాణిలో జిల్లాఇన్‌చార్జి ఉపాధికల్పన అధికారి మిల్కా అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌ చేసి అక్కడినుంచే మాట్లాడారు.

అభ్యంతరాలు ఇలా..

టెండర్‌ నోటిఫికేషన్‌లో పొందుపర్చిన పలు నిబంధనల విషయంలో ఏజెన్సీ నిర్వాహకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 2006లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 4459ను పూర్తిగా బేఖాతరు చేస్తూ కొందరికి మాత్రమే మేలు చేసేలా ఈ నిబంధనలు రూపొందించారని పలువురు ఏజెన్సీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అందులో ప్రధానంగా దరఖాస్తు ఫీజు రూ.10వేలు, ఈఎండీ రూ.5లక్షలు చెల్లించాలని, రెండేళ్లలో రూ.కోటి టర్నోవర్‌ కలిగి ఉండాలని, వంద మంది ఉద్యోగుల నిర్వహణ చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో పలువురు ఏజెన్సీ నిర్వాహకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కొత్త ఏజెన్సీలకు ఈ నిబంధనల కారణంగా ఎలా అవకాశం లభిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా వంద మంది ఉద్యోగుల నిర్వహణ కంటే తక్కువ సంఖ్యలో అనుభవం ఉన్న ఏజెన్సీల పరిస్థితి ఏమిటని అంటున్నారు. ప్రభుత్వ జీవోలో అసలు ఈఎండే తీసుకోవద్దని ఉన్నప్పటికీ రూ.5లక్షలు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తున్నారు. నామమాత్రంగా దరఖాస్తు ఫీజు ఉండాల్సి ఉండగా, ఏకంగా రూ.10వేలు ఎలా నిర్ణయించారని ప్రశ్న లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా నూతన ఎంప్యానల్‌మెంట్‌ రూపొందించేందుకు టెండర్లు నిర్వహిస్తుండగా, కమిటీ ఆమోదంతోనే ఈ నోటిఫికేషన్‌ జారీ అయ్యిందా అని అడుగుతున్నారు.

‘ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించిన టెండర్‌ నోటిఫికేషన్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి.. ఈ విషయంలో ఏజెన్సీ నిర్వాహకులతో మంగళవారం సమావేశమై చర్చించి కొలిక్కి తేవాలి..’ ఇది జిల్లా ఇన్‌చార్జి ఉపాధికల్పన అధికారి మిల్కాకు కలెక్టర్‌ రాజర్షిషా ఫోన్‌లో చేసిన ఆదేశాలు.

పరిశీలిస్తున్నాం..

ప్రజావాణిలో కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు నోటిఫికేషన్‌ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తు ఇచ్చారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పరిశీలన చేస్తున్నాం. ఉపాధికల్పన అధికారి సోమవారం అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఈ విషయంలో ఆమె నుంచి స్పష్టత తీసుకొని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం. అనంతరం తదుపరి చర్యలు చేపడతాం.

– శ్యామలాదేవి, అదనపు కలెక్టర్‌

● ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్‌పై అభ్య1
1/3

● ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్‌పై అభ్య

● ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్‌పై అభ్య2
2/3

● ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్‌పై అభ్య

● ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్‌పై అభ్య3
3/3

● ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్‌పై అభ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement