
భూభారతితో సమస్యలు పరిష్కారం
సాత్నాల: భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భోరజ్ మండలంలోని బా లాపూర్‌లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలు సుకున్నారు. అలాగే గణేశ్‌పూర్ శివారులోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు వేగవంతంగా నాణ్యమైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేసి వివరాలను సంబంధిత అధికారులకు పంపి క్షేత్రస్థాయిలో పరి ష్కరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అర్హులై న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా మ రోసారి జాబితాలు పరిశీలించాలన్నారు. అనంతరం గణేశ్‌పూర్ శివారులోని సర్వేనంబర్–1లో కాస్తు, సాదాబైనామాలో పట్టాకోసం వచ్చి న దరఖాస్తులను, స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ రఘునాథ్‌రావ్, ఏఈ, డీటీ పాల్గొన్నారు.
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేపట్టాలి
ఇచ్చోడ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. మండలకేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు. ఆయన వెంట జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాశ్ ఉన్నారు.
సంస్కృతిని భావితరాలకు అందించాలి
గుడిహత్నూర్: ఆదివాసీ సంస్కృతిని భావితరా లకు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని శంభుగూడలో కొద్ది రోజులుగా ఆదివాసీ సకల కళా వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ కాత్లే శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుస్సాడీ, ఇతర ఆదివాసీ కళల శిక్షణ శిబిరంలో పాల్గొని మాట్లాడారు. ఇందులో ఎస్పీ అఖిల్ మహాజన్, డీటీ భాగ్యలక్ష్మి, ఎంపీడీవో అబ్ధుల్ హై, ఆర్‌ఐ అరుణ్, గ్రామ మాజీ సర్పంచ్ శంభు, ఆదివాసీ సంగీత విధ్వాంసులు పాల్గొన్నారు.