
పర్యవేక్షణపై దృష్టి సారించాలి
అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి. ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో పోస్టులు భర్తీ చేస్తేనే సర్కారు విద్య గాడిన పడుతుంది. డైట్ కళాశాలలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యావ్యవ్థ కుంటుపడుతుంది. వీటిపై దృష్టి సారిస్తే సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.
– బి.రవీంద్ర, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు