రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలి
ఆదిలాబాద్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పో టీల్లో రాణించిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో నూ ప్రతిభ కనబరచాలని డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం జిల్లాస్థాయి సబ్ జూని యర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారన్నారు. అండర్ –8, 10, 12 విభాగంలో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించి ఎంపికై న వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతున్నట్లు వివరించారు. ఇందులో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రాజేశ్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ కాంతారావు, పెటా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పార్థసారథి, సాయికుమార్, రాకేష్, సౌమ్య, జ్యోతిస్వరన్ తదితరులు పాల్గొన్నారు.


