
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
ఆదిలాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమం వెలకట్టలేనిదని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుంచి ఆపరేషన్ సిందూర్‌ను కీర్తిస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించా రు. ఇందులో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్‌దాస్, ఆరే దేవన్న, గడ్డం అశోక్, వామన్ రెడ్డి, బండారి వినోద్, శ్రీహరి, ఎల్‌వీ రావు, బండారి మనోహర్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.