సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
ఆదిలాబాద్‌అర్బన్: జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ఇందులో భాగంగానే నిర్వహించనున్న సమ్మెను విజయవంతం చేయాలన్నారు. ఇందులో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్, నాయకులు మంతెన కాంతారావు, మెరుగు చిరంజీవి, సురేశ్, అశోక్, లక్ష్మి, శాంత, ముజీబ్, ఖాసిం, సలీం, జమీల్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.


