అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్టు
రాం రాం.. అమ్మ.. మళ్ల వాంథోమ్
జిల్లాలో శాంతిభద్రతల విషయంలో తన మార్కు చూపుతున్న ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఉట్నూర్ మండలం కుమ్మరికుంటలో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై కాకుండా ఆదివాసీ మహిళల మధ్యలో కింద కూర్చొని వారి జీనవ విధానం, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ముగింపు సమయంలో ఎస్పీ నోట రాం..రాం.. అమ్మ.. మళ్ల వాంథోమ్ (మళ్లీ వస్తాం) అంటూ గోండి భాషలో అనడంతో మహిళలు అబ్బురపోయారు. చిరునవ్వులు చిందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. – ఉట్నూర్‌రూరల్
ఆదిలాబాద్‌రూరల్: అంతర్రాష్ట సైబర్ నేరాలకు పా ల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మావల ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపా రు. దేశవ్యాప్తంగా 37 కేసుల్లో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన మహ్మద్ ఫరూఖ్‌ను శనివారం అరెస్టు చేసినట్లు పేర్కొన్నా రు. ఈ నెల 8న ఆదిలాబాద్ పట్టణంలోని కై లాస్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఖలీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలిపారు. డిసెంబర్ 7న బాధితుడికి వాట్సాప్ కాల్ చేసి మరణించిన తన సోదరుడు అస్లాం మౌలానాకు తాను శ్రేయోభిలాషినని చెప్పాడు. రూ.లక్ష ఆర్థిక సాయం పంపిస్తానని నమ్మించాడు. నకిలీ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ పంపి వివిధ కారణాలు చెప్పి కొంత డబ్బు పంపమని కోరాడు. దీంతో బాధితుడు రూ.58,500లను ఓ బ్యాంకు ఖాతాకు పంపించాడు. అనంతరం మోసానికి గురైనట్లు గ్రహించాడు. కేసు నమోదుతో ఎస్సై దర్యాప్తు చేపట్టి సాంకేతిక సహకారంతో వివరాలు సేకరించారు. ఈ నెల 26న మావల మండలంలోని రాంనగర్‌లో నిందితుడు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో 37 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలింది. ఇటీవల చోటుచేసుకున్న మరణాలను గుర్తించి భార్య, బంధువులు, స్నేహితుల పేరిట సిమ్ కార్డులు వినియోగించడం, మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తెలింది. ఈమేరకు జడ్జి ఎదుట శనివారం హాజరుపరచగా నిందితుడిని 15 రోజుల రిమాండ్‌కు విదిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్టు


