అప్పుల బాధతో 27 మంది రైతుల ఆత్మహత్య..
మొత్తం సాగు విస్తీర్ణం : 5.20 లక్షల ఎకరాలు
పత్తి : 4.30 లక్షల ఎకరాలు, సోయా :70 వేల ఎకరాలు
ఇతర పంటలు: 20వేల ఎకరాలు
జిల్లాలో
వానాకాలం సాగు వివరాలు..
సీసీఐకి పత్తి విక్రయించిన రైతులు : 4,717 మంది
పత్తి
విక్రయాలు
ప్రైవేట్‌లో విక్రయించిన రైతులు : 1,968 మంది
విక్రయించిన పత్తి : 30,300 క్వింటాళ్లు
విక్రయించిన పత్తి : 8లక్షల 5వేల 544 క్వింటాళ్లు
జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పంటలు పత్తి, సోయా, మొక్కజొన్న. ఈ సీజన్‌లో కురిసిన భారీ వర్షాలతో ఆయా పంటలు చాలా వరకు దెబ్బతి న్నాయి. దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి బేళ్లకు ధర తక్కువ ఉండడంతో మద్దతు ధర కంటే ఎక్కువ కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో అందరి చూపు సీసీఐపైనే పడింది. అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన సవాలక్ష నిబంధనలతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. కపాస్ కిసాన్ యాప్ ఇక్కట్లతో పాటు తేమ కొర్రీలు వెంటాడగా.. చాలా మంది రైతులు ప్రైవేట్‌లోనే మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించారు. అధిక వర్షాల కారణంగా రంగు మారిన సోయా పంట అమ్ముకునేందుకు రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులకు ఈ ఏడాది ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. మత్స్య శాఖ ద్వారా చేప పిల్లలు 50 శాతం మాత్రమే చెరువుల్లో వదిలిపెట్టగా, లక్ష్యం నెరవేరలేదు. ఆలస్యంగా వదలడంతో దిగుబడిపై ప్రభావం చూపనుంది. చేపపిల్లలను ఏటా జూన్‌లో వదలాల్సి ఉండగా, డిసెంబర్ పూర్తవుతున్నా లక్ష్యం నెరవేరని పరిస్థితి.
కన్నీరే మిగిలింది..
ఈఏడాది అతివృష్టితో పంటలు తీవ్రంగా దెబ్బతి న్నాయి. ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 22 వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అక్టోబర్ 28 నుంచి నవంబర్‌లో ముంథా తుపాన్ పంటలపై ప్రభావం చూపింది. దీంతో 18,310 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. పత్తి దిగుబడి ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా ఐదారు క్వింటాళ్లు కూడా దాటలేదు. సోయా దిగుబడి కూడా సగానికి తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. రంగు మారిన పంటను ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో వారికి ఎదురుచూపులు తప్పడం లేదు.
భరోసా ఏది?
పంట పెట్టుబడి కోసం రైతులకు ఇచ్చే రైతు భరోసా ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదు. ఇప్పటికే రబీకి సంబంధించి సాగు పనులు ఊపందుకున్నాయి. పెట్టుబడి కోసం అన్నదాతకు అప్పులు చేయాల్సిన దుస్థితి. కొన్నేళ్లుగా మూలనపడ్డ యంత్రలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ఈఏడాది ప్రవేశపెట్టినప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోలేదు. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. ఖరీఫ్ సీజన్‌లో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పంటలు పండకపోవడం, దిగుబడి రాకపోవ డం, సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చే మా ర్గం లేక ఆందోళనకు గురైన రైతులు మనస్తాపంతో తనువుచాలించారు. జిల్లాలో 27 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.
అప్పుల బాధతో 27 మంది రైతుల ఆత్మహత్య..


