ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆదిలాబాద్: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను శని వారం కలిసి విన్నవించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీను మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పరిష్కారాన్నికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో జేఏసీ నాయకులు సంతోష్, రవి, నరేష్, తోట రాజు, జ్ఞానేశ్వర్, రవికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


