క్షయ నిర్మూలన అందరి బాధ్యత
ఇంద్రవెల్లి: టీబీ(క్షయ) నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా క్షయవ్యాధి నిర్మూలన అధికారి సుమలత అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కళావతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్షయ మిత్ర పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వ్యాధిగ్రస్తుల్లో రోగనిరోధక శక్తి పెంపొందించడానికి పౌష్టికాహార కిట్లు దోహదపడతాయన్నారు. మూడు వారా ల కంటే ఎక్కువ దగ్గు ఉంటే సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూ చించారు. ఇందులో జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేట ర్ సునీల్‌కుమార్, కళావతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆశోక్, డాక్టర్ పూజిత, ఎస్సై సాయ న్న, వైద్య సిబ్బంది ఉన్నారు.


