
సైన్యానికి మద్దతుగా పూజలు
తాంసి: ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా సరి హద్దులో పోరాటం చేస్తున్న భారత త్రివిధ దళాలకు, ఆపరేషన్ సిందూర్‌కు ప్రతి ఒకరూ మద్దతుగా నిలవాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. త్రివిధ దళాలకు మద్దతుగా మండలంలోని పొన్నారి సంకట్‌యోచన్ హనుమా న్ ఆలయంలో ఎంపీ ఆదివారం ప్రత్యేక పూ జలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పాక్ ఉగ్రవాదులు సరిహద్దు వెంట దాడులకు పాల్పడుతుండగా భారత త్రి విధ దళాలు ధీటుగా తిప్పికొడుతున్నాయన్నారు. ఇందులో మాజీ జెడ్పీటీసీ రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రకిరణ్, నాయకులు సదానంద్, అరుణ్, నారాయణ, ప్రవీణ్ రెడ్డి తదితరులున్నారు.