
అర్హుల జాబితా సిద్ధం చేయాలి
కై లాస్‌నగర్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను నాలుగు రోజుల్లో పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూ చించారు. ఇందుకోసం రెండు షిఫ్ట్‌లుగా ఆపరేటర్ల ను నియమించుకుని ఈ నెల 19లోపు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, బ్యాంక్ అధి కారులు, మండల ప్రత్యేకాధికారులతో సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశీలించిన దరఖాస్తులపై రోజు వారీ నివేదిక అందించాలని సూచించారు. మండల స్థాయిలో పరిశీలించిన దరఖాస్తుల వివరాలను సంబంధిత బ్యాంకులకు పంపించాలని తెలిపారు. జి ల్లావ్యాప్తంగా 48,296 దరఖాస్తులు రాగా 43,417 (డెస్క్ వెరిఫికేషన్) దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. 32,283 దరఖాస్తులను బ్యాంక్‌లకు పంపించినట్లు తెలిపారు. బ్యాంక్ మేనేజర్లు పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసి సోమవారంలోపు జాబితా అందించాలని ఆదేశించారు. బ్యాంకుల ద్వారా జాబితా పూర్తయిన అనంతరం ఎంపీడీవోలు తుది జాబితా తయారు చేసి పంపించాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో కుష్బు గుప్తా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావు, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజర్షి షా
రాజీవ్ యువ వికాసంపై సమీక్ష

అర్హుల జాబితా సిద్ధం చేయాలి