
ఆదిలాబాద్‌కు చేరిన రథయాత్ర
ఆదిలాబాద్‌రూరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా కులగణన ప్రక్రియ శాసీ్త్రయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ మేలుకో రథయాత్ర గురువారం ఆదిలాబాద్‌కు చేరింది. బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ ఆవరణలోని జ్యోతీబాఫూలే విగ్రహానికి ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాన్ని ప్రతీ పల్లెలో బలోపేతం చేసి బీసీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో రథయాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, నాయకులు జక్కుల సత్యనారాయణ, దాసరి రమేశ్, బొమ్మకంటి రమేశ్, చిలుక విలాస్, ఎర్రం నర్సింగ్‌రావ్, ఉదారి నగేశ్, అల్లూరి భూమన్న, దర్శనాల నగేశ్, తన్నీరు నవత, అసం రమాదేవి, ఊషన్న, కుర్ర రవి, చిప్ప గంగన్న, దాసరి రమేశ్ తదితరులున్నారు.