
● బిల్లులు పెండింగ్.. పనులు స్టాప్ ● ఒత్తిడికి లోనవుత
ఇతని పేరు గుట్ట ప్రవీణ్. 46 సంవత్సరాలు. ఆదిలా బాద్ పట్టణం పాత హౌసింగ్ బోర్డు కాలనీ. క్లాస్–1 కాంట్రాక్టర్‌గా వ్యవహరించాడు. నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ప్రధానంగా ఈయన ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలకు సంబంధించిన అనేక రోడ్లు, వంతెనలు, ఇతరత్రా పనులు నిర్వహించాడు. ఇతడికి సంబంధించి సుమారు రూ.60 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి క్లియరెన్స్ కోసం తిరుగుతున్న మంజూరు కావడం లేదు. ఈ క్రమంలో ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రవీణ్ మాత్రమే కాదు.. పలువురు కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఇది జిల్లా కేంద్రంలోని మావల నుంచి దస్నాపూర్ వచ్చే ప్రధాన రహదారి డివైడర్‌కు ఒక వైపు భాగం. 2023–24లో ఈ రహదారిని అభివృద్ధి పర్చేందుకు ఆర్‌అండ్‌బీ ద్వారా రూ.13కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం వర్క్ మంజూరు చేసింది. డివైడర్‌కు మరోవైపు పనులు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వం నుంచి అరకొరగా బిల్లులు వచ్చాయి. మంజూరులో తాత్సారం కావడంతో కాంట్రాక్టర్ చేసేది లేక ఆ పనులు చేపట్టలేకపోయాడు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించడం లేదు. మరో వైపు ఇలాంటి అనేక రోడ్ల పనులు జిల్లాలో నిలిచిపోయాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.
●
సాక్షి,ఆదిలాబాద్: ఈ రెండు అంశాలు జిల్లాలో బ్రేక్ పడిన అభివృద్ధి పనులు, పలుచోట్ల పనులు చేపట్టినా బిల్లులు అందని కాంట్రాక్టర్ల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రస్తుతం పెండింగ్ బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని స్పష్టం చేస్తుండడంతో కాంట్రాక్టర్లు మనోవేదనకు గురవుతున్నారు. బిల్లుల కోసం తరచూ హైదరాబాద్ బా ట పడుతున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ ప్రవీణ్ మృతి చెంది నట్లు తెలుస్తోంది. బడాకాంట్రాక్టర్లతో పాటు చోటా మోటా కాంట్రాక్టర్లు కూడా పెండింగ్‌లో ఉన్న బిల్లులతో సతమతం అవుతున్నట్లు చెబుతున్నారు.
లైసెన్స్ వదులుకున్న బడా కాంట్రాక్టర్..
తాజాగా ప్రవీణ్ మృతి తర్వాత కొంత మంది రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారలు ఏకంగా కాంట్రాక్టర్లకు సల హా ఇస్తున్నారు. పెండింగ్ బిల్లుల నేపథ్యంలో ఇప్ప ట్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని, అనవసరంగా బయట అప్పు చేసి ఇబ్బందులకుగురికావద్దని పే ర్కొనడం సంచలనం కలిగిస్తుంది. ఇదిలా ఉంటే.. జిల్లాలో కొన్నేళ్ల క్రితం తిరుమల, బాలాజీ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీల మధ్య పెద్ద పెద్ద రోడ్ల పనులు చేపట్టేందుకు పోటీ ఉండేది. మధ్యలో బిల్లుల పెండింగ్ నేపథ్యంలో బాలాజీ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ పూర్తిగా కా ంట్రాక్ట్ పనులు మానుకొని లైసెన్స్ వదులుకుందనే ప్రచారం ఉంది. ఆ సమయంలో సదరు యజమాని సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఈ రంగం నుంచి తప్పుకున్నారని ప్రస్తుతం ఆదిలాబాద్‌లో చర్చ సాగుతుంది. మిగతా కాంట్రాక్టర్లు పనులు చేపట్టి ఒత్తిడిని మూటగట్టుకున్నారని పేర్కొంటున్నారు.
సందెట్లో సడేమియా..
పెండింగ్ బిల్లుల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రస్తుతం ఆ బిల్లులను క్లియర్ చేపిస్తామని చెబుతూ పలువురు దళారులు తయారయ్యారనే ప్రచారం సాగుతుంది. ఇలా పెండింగ్ బిల్లులకు సంబంధించి ముందుగానే కమీషన్ తీసుకొని బిల్లు మంజూరు చేయిస్తామని చెబుతూ నెలలు గడిచినా ఆ డబ్బులు రాకపోవడంతో ఇలాంటి బాధితులు మరింత నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని పలువురు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం, వరంగల్, ఇతర జిల్లాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు కొంతమేర మంజూరవుతున్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించిన బిల్లుల క్లియరెన్స్‌లో మాత్రం వివక్ష సాగుతుందనే ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉంటే గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు పలువురు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. ఆ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ సమయంలో అనేక పనులకు సంబంధించి అగ్రిమెంట్లు జరిగినప్పటికీ పనులు షురూ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ల మీదా ఒత్తిడి తీసుకురావడంతో వారు ఆ పనులు చేపట్టారు. అయితే పెండింగ్ బిల్లుల విషయంలో మా త్రం ఆ కాంట్రాక్టర్లకు మొండి చెయే ఎదురైందన్న అపవాదు ఉంది. ఈ పరిస్థితుల్లో బిల్లులు చెల్లించి, అభివృద్ధి పనుల పరంగా ప్రజలకు అసౌకర్యాలను దూరం చేయాలన్న అభిప్రాయం పలు వురి నుంచి వ్యక్తమవుతుంది. కాగా, పెండింగ్ బిల్లులు, నిలిచి పోయిన అభివృద్ధి పనుల విషయంపై ‘సాక్షి’ ఆర్ అండ్‌బీకి చెందిన ఓ అధికారి వివరణ కోరగా, ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

● బిల్లులు పెండింగ్.. పనులు స్టాప్ ● ఒత్తిడికి లోనవుత

● బిల్లులు పెండింగ్.. పనులు స్టాప్ ● ఒత్తిడికి లోనవుత