
ఏడేళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టా..
– కోట రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో,
బజార్‌హత్నూర్
కుటుంబ నేపథ్యం: సొంతూరు పాత నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ గ్రామం.
మాది వ్యవసాయ కుటుంబం. నాన్న సాయిరెడ్డి, అమ్మ అచ్చమ్మ.
విద్యాభ్యాసం: పాఠశాల, ఇంటర్ విద్య బోధన్‌లో, డిగ్రీ హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో పూర్తి చేశాను.
లక్ష్యసాధన: డిగ్రీ పూర్తి కాగానే ఎస్సై ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదివాను. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోనే ఏడేళ్లు పుస్తకాలతోనే కుస్తీ పట్టా. 2019లో మొదటి ప్రయత్నంలో 1.5 మార్కుల తేడాతో చేజారింది. నిరాశ చెందకుండా మళ్లీ ప్రణాళికాబద్ధంగా చదివా. విజయం సాధించా.
సమాజంలో మీరు కోరుకునే మార్పు..: యువత సన్మార్గంలో నడవాలి. ఆ దిశగా నావంతు ప్రయత్నం చేస్తా.
నిరుద్యోగులకు మిరిచ్చే సూచన: లక్ష్యసాధనలో ఓటమి ఎదురైనా నిరాశ చెందొద్దు. ప్రణాళికాబద్ధంగా నిరంతర సాధన చేస్తే విజయం ఖాయం.