
దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి
● కలెక్టర్ రాజర్షిషా
సాత్నాల: భూభారతి చట్టం కింద రైతులు, ప్రజ ల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరి శీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టా లని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. భూభారతి రెవె న్యు సదస్సుల్లో భాగంగా భోరజ్ మండలంలోని డొల్లారా గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ఆధారంగా రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పైలెట్ ప్రాతిపాదికన జిల్లాలోని భోరజ్ మండలంలో గల 28 గ్రామాల్లో ఈనెల 16వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వచ్చిన 17 దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. అనంతరం దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అధికా రులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో వివరాలు సమగ్రంగా పరిశీలించాలని, అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తహసీల్దా ర్ వేణుగోపాల్, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు.