
● భారత సేనల ఆపరేషన్‌పై హర్షాతిరేకాలు ● పహల్గాం ఉగ్రదాడి
ఆదిలాబాద్/బోథ్: అది కశ్మీర్లోని పహల్గాం బైసారన్ వ్యాలీ. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే పర్యాటక ప్రదేశంలో టూరిస్టుల తాకిడి ఎక్కువ. అయితే ఏప్రిల్ 22న ఆ పచ్చనిప్రాంతం ఎరుపెక్కింది. ప్రకృతిలో సేదతీరుతున్న పర్యాటకులతో ఉత్సా హంగా నిండిన ఆ ప్రాంతం ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. మనిషి ముసుగులో ముష్కరులు మారణ హోమం సృష్టించారు. మతాన్ని అడిగి మరీ రాక్షసత్వంతో మహిళల సింధూరాలను చెరిపేశారు. భార్యల ముందే వారి భర్తలను కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిని దేశం అంతా ముక్తకంఠంతో ఖండించింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నినదించింది. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుస్తూ ఏప్రిల్ 7న భారత సేనలు అర్ధరాత్రి సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్,పాక్‌లోని 9 ముష్కర స్థావరాలపై ముప్పేట దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రస్థానాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. జిల్లాకు చెందిన మాజీ సైనికులు మరోసారి బార్డర్‌కు వెళ్లేందుకు సిద్ధమంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురి అభిప్రాయాలు..