● వేంకటేశ్వర ఆలయ ఆస్తులు సురక్షితమేనా..? ● ఆవరణలో చేపట్టిన ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం వివాదాస్పదం ● దేవాదాయ శాఖ ప్రస్తావన లేకుండానే టెండర్‌ నోటిఫికేషన్‌ ● ఓ ట్రస్ట్‌ తీరుపై సర్వత్రా విమర్శలు | - | Sakshi
Sakshi News home page

● వేంకటేశ్వర ఆలయ ఆస్తులు సురక్షితమేనా..? ● ఆవరణలో చేపట్టిన ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం వివాదాస్పదం ● దేవాదాయ శాఖ ప్రస్తావన లేకుండానే టెండర్‌ నోటిఫికేషన్‌ ● ఓ ట్రస్ట్‌ తీరుపై సర్వత్రా విమర్శలు

May 10 2025 7:55 AM | Updated on May 10 2025 7:55 AM

● వేంకటేశ్వర ఆలయ ఆస్తులు సురక్షితమేనా..? ● ఆవరణలో చేపట్

● వేంకటేశ్వర ఆలయ ఆస్తులు సురక్షితమేనా..? ● ఆవరణలో చేపట్

రెండంతస్తులకే అన్ని రూ. కోట్లా..?

వేంకటేశ్వర ఆలయ ఆవరణలో 70 x 130 చదరపు అడుగుల స్థలంలో సెల్లార్‌తో కూడిన రెండంతస్తుల్లో ఫంక్షన్‌ హాల్‌ నిర్మిస్తున్నారు. దీనికి రూ.7.30 కోట్ల అంచనా వ్య యం చూపిస్తున్నారు. అయితే అందులో ఎ లాంటి హంగులు కల్పిస్తున్నారు.. రాజ భవ నం ఉట్టిపడేలా ఏవైన సదుపాయాలు కల్పి స్తున్నారా.. రెండంతస్తులకే అన్ని కోట్లు ఎందుకు.. అనేది ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్న సందేహాలు. కాగా, ట్రస్ట్‌ సభ్యులు భారీగా స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ అంటేనే ప్రధాన మార్కెట్‌ ప్రాంతం. వ్యాపార, వాణిజ్య సముదా యాలతో నిండిపోయి ఉంటుంది. అలాంటి చోట ఓ రెండెకరాల స్థలం దేవాదాయ శాఖ, ఓ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సంయుక్తంగా కొనసాగుతుంది. స్థలం మధ్యలో వేంకటేశ్వర ఆలయం ఉండగా, చుట్టూ 46 వ్యాపార దుకాణాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు రూ.50లక్షల ఆదాయం సమకూరుతుంది. అంతే కాకుండా గుడిహత్నూర్‌ మండలం సీతాగోందిలో ఈ ఆలయానికి సంబంధించి ఆరెకరాల భూమి కూడా ఉంది. మొత్తంగా ఏడాదికి సుమారు కోటి రూపాయల ఆదాయం వరకు లభిస్తుందని అధికారులే చెబుతున్నారు. విలువైన ఆస్తులే కాకుండా నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా పెద్ద ఎత్తున హుండీ ఆదాయం సమకూరుతుంది. అయితే సంయుక్త నిర్వహణలో ఉన్నప్పుడు దేవాదాయ శాఖ ప్రస్తావనే లేకుండా ట్రస్ట్‌ పేరిట టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఆలయ ఆవరణ స్థలంలో ఫంక్షన్‌హాల్‌ నిర్మిస్తుండటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. సంయుక్తంగా నోటిఫికేషన్‌ ఇచ్చి ఉంటే ఇది వివాదాస్పదమయ్యేది కాదు. తద్వారా ఆలయం ఉన్న ఈ భూములపై ట్రస్ట్‌ కన్నేసిందా.. పూర్తిగా ఆ ఆస్తిని కాజేయాలనే కుటిల యత్నాలకేమైనా పాల్పడుతుందా అనే అనుమానాలు పట్టణ ప్రజలకు కలుగుతున్నాయి. దీంతో ఆలయ భూములు సురక్షితమేనా.. లేని ప క్షంలో అన్యాక్రాంతం అయ్యే ప్రమాదమేమైన ఉందా.. అనే సందేహాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి.

హుండీ ఆదాయంతో నిర్మాణం..

సాధారణంగా ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా కానుకలు, డబ్బులు వంటివి వచ్చినప్పుడు దా నికి సంబంధించిన లెక్కలు స్పష్టంగా ఉండాలి. సంయుక్త నిర్వహణలో ఉన్నప్పుడు అసలు ఇవి అటు దేవాదాయ శాఖకు, ఇటు ట్రస్ట్‌కు ఎంత చెందాలనే విషయాల్లోనూ ఒక స్పష్టత ఉండా లి. అంతే కాకుండా వీటిని అభివృద్ధి పనులకు వెచ్చించినప్పుడు అందులో దేవాదాయ శాఖ సొమ్ము ఎంత..? ట్రస్ట్‌ భాగస్వామ్యం ఎంత అనే వివరాలు స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం ఉండదనే అభిప్రాయం పలువురు భక్తుల్లో ఉంది. అయితే ట్రస్ట్‌ ఏకపక్షంగా నోటిఫికేషన్‌ ఇవ్వడం, అందులో ఒక అధికారి హోదాను ప్రస్తావించినప్పటికీ కనీసం ఆయనది ఏ శాఖ అనేది కూడా దానికింద పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఆ టెండర్‌పై స్పష్టత లేదు..

టెండర్‌ నోటిఫికేషన్‌లో దేవాదాయ శాఖ ప్రస్తావన ఎందుకు లేదనే విషయంలో నాకు స్పష్టత లేదు. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తిగా ఇక్కడి నుంచి జరిగిన తర్వాత హెడ్‌ ఆఫీస్‌ నుంచి టెండర్‌ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు. ఈవో వద్దే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది.

– నవీన్‌కుమార్‌, దేవాదాయశాఖ

అసిస్టెంట్‌ కమిషనర్‌, ఆదిలాబాద్‌

శాఖ పేరు రాశాం.. ప్రచురణల్లో మారింది

టెండర్‌ నోటిఫికేషన్‌కు సంబంధించి మేము శాఖాపరంగా రాసిచ్చిన దాంట్లో ఎగ్జిక్యూటి వ్‌ ఆఫీసర్‌, దేవాదాయశాఖ అని పొందుపరి చాం. ఐఅండ్‌పీఆర్‌లో మారి ఉండవచ్చు. ట్రస్ట్‌వాళ్లకు పూర్తిగా ఇచ్చే అధికారం లేదు.

– రమేశ్‌, ఈవో, దేవాదాయ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement