● జిల్లాలో మద్యం వ్యాపారుల తీరిది ● ధరల పెంపు ముందే పసిగట్టి భారీగా సరుకు కొనుగోలు ● నిల్వ లిక్కర్‌ ధర పెంచి విక్రయాలు ● మందుబాబుల జేబులకు చిల్లు ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న ఎకై ్సజ్‌ శాఖ | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో మద్యం వ్యాపారుల తీరిది ● ధరల పెంపు ముందే పసిగట్టి భారీగా సరుకు కొనుగోలు ● నిల్వ లిక్కర్‌ ధర పెంచి విక్రయాలు ● మందుబాబుల జేబులకు చిల్లు ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న ఎకై ్సజ్‌ శాఖ

May 25 2025 12:38 AM | Updated on May 25 2025 12:38 AM

● జిల్లాలో మద్యం వ్యాపారుల తీరిది ● ధరల పెంపు ముందే పసి

● జిల్లాలో మద్యం వ్యాపారుల తీరిది ● ధరల పెంపు ముందే పసి

సాక్షి,ఆదిలాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం గడిచిన సోమవారం రాష్ట్రంలో లిక్కర్‌ ధరలు పెంచింది. అయితే గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఫుల్‌బాటి ల్‌పై రూ.40, హాఫ్‌పై రూ.20, క్వార్టర్‌ పై రూ.10 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే పాత స్టాక్‌పై కొత్త రేటును వైన్స్‌ య జమానులు వసూలు చేస్తున్నారు. నిల్వ ఉన్న స్టాక్‌ను అడ్డగోలుగా పెంచి మందుబాబుల జేబు లకు చిల్లు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలోని అన్ని వైన్స్‌లలో ఇది బాహాటంగా సాగుతుంది. కొంత మంది బాటిళ్లపై ఉన్న ఎంఆర్‌పీ విషయంలో ప్రశ్నిస్తే.. ప్రభుత్వం పెంచినప్పటి నుంచి ఆ ధరలు అటోమెటిక్‌గా అమల్లోకి వచ్చాయని చెబుతున్నారు. కొన్నిచోట్ల మద్యంప్రియులు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. కొంత మంది పోనిలే అని అక్కడినుంచి వెళ్లిపోతున్నారు.

ముందే సమాచారం లీక్‌.. స్టాక్‌ ఫుల్‌గా కొనుగోలు

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19 నుంచి మద్యం ధరలు పెంచేసింది. అయితే ఈ సమాచారం మద్యం వ్యాపారులకు ముందుగానే లీక్‌ అయినట్లు ప్ర చారం ఉంది. దీంతో వారు అన్నిరకాల లిక్కర్‌ బాటిళ్లకు సంబంధించి స్టాక్‌ ఫుల్‌గా కొనుగోలు చేసి వైన్స్‌లలో నిల్వ ఉంచారు. జిల్లా కేంద్రంలో ని ప్రతీ వైన్స్‌లలో ఇప్పుడు నెలకు పైగా సరిపడా సరుకు నిల్వ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాత లిక్కర్‌ బాటిళ్లను కొత్త ధరతో అమ్మడం ద్వారా మద్యం వ్యాపారులు దండిగా మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు.

ప్రేక్షక పాత్రలో ఎకై ్సజ్‌శాఖ..

సాధారణంగా మద్యం ధరలు ప్రభుత్వం పెంచి న తర్వాత ఎకై ్సజ్‌ శాఖ అధికారులు పాత స్టాక్‌ వి షయంలో నిర్ణయాత్మక పాత్ర వహించాలి. ప్రధానంగా ప్రతీ వైన్స్‌లో ఎంత మేరకు పాత స్టాక్‌ ఉందనేది పరిశీలన చేయాలి. ఆ లిక్కర్‌ను పాత ధరలోనే విక్రయించాలి. ఇక కొత్త స్టాక్‌ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ ఎంఆర్‌పీకి అనుగుణంగా విక్రయాలు జరిగేలా చూడాలి. అయితే వైన్స్‌లలో పాత స్టాక్‌ను బాహాటంగా కొత్త ధరలతో అమ్ముతున్నప్పటికీ ఆశాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

మాకెలాంటి ఫిర్యాదు రాలేదు

వైన్స్‌లలో పాత స్టాక్‌ను కొత్త ధరలతో అమ్ముతున్నారనే విషయంపై మాకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఈ విషయంలో తనిఖీలు చేయాలని కూడా ఆదేశాలు రాలేదు. అయినప్పటికీ ఈ విషయంలో పరిశీలన చేస్తాం.

– హిమశ్రీ, జిల్లా ఎకై ్సజ్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement