భోరజ్ మండలంలో వచ్చిన దరఖాస్తులు వివరాలిలా..
● పైలట్ మండలంలో భారీగా దరఖాస్తులు ● ప్రారంభమైన క్షేత్రస్థాయి విచారణ ● ఆరు ప్రత్యేక బృందాల ఏర్పాటు
కై లాస్‌నగర్: ధరణిలో ఆప్షన్లు లేని కారణంగా పేరుకుపోయిన భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం–2025ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. చట్టం అమల్లో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలాన్ని పైల ట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. అక్కడి భూసమస్యలు తెలుసుకునేందుకు గాను ఈనెల 5నుంచి 16వరకు గ్రామాల వారీగా రెవె న్యూ సదస్సులు నిర్వహించింది. ముగ్గురు తహసీల్దార్ల ఆధ్వర్యంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రోజుకు మూడు గ్రామాల చొప్పున సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే భారీగా దరఖాస్తులు అందాయి. జూన్ 2 నుంచి చట్టం పూర్తి స్థాయిలో అమలు కాను న్న నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అందిన ప్రతీ దరఖాస్తు పరిష్కరించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. సమస్యలు ఏ మేరకు పరిష్కరించి అన్నదాతకు భరోసా కల్పిస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
1,067 దరఖాస్తులు ..
భోరజ్‌మండలంలో 28 రెవెన్యూ గ్రామాలున్నాయి. భోరజ్,భీంపూర్,బేల తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఎని మిది మంది రెవెన్యూ ఉద్యోగులతో కూడిన మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సదస్సులు నిర్వహించారు. అందులో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.ఆయా భూసమస్యలకు సంబంధించి మొత్తం 1067 దరఖాస్తులు అందాయి. ఇందులో అ త్యధికంగా సర్వేనంబర్లలో తప్పిదాలు,పట్టాదారు పాస్ పుస్తకంలో భూమి మిస్సింగ్, సరిహద్దుల వివాదం, పేర్ల మార్పిడి, డిజిటల్ సిగ్నిచర్ పెండింగ్, భూ విస్తీర్ణంలో తేడాలు, విరాసత్ వంటివి ఉన్నా యి. వీటన్నింటిని గ్రామం, రైతుల వారీగా కంప్యూటరీకరించిన రెవెన్యూ అధికారులు వాటిని పరిష్కరించే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారు.
ప్రారంభమైన క్షేత్రస్థాయి విచారణ
సదస్సుల్లో అందిన దరఖాస్తులను జూన్ 2లోగా పరిష్కరించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం భీంపూర్, భోరజ్, బేల, తలమడుగు, బజార్‌హత్నూర్, ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఆరు త్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నేతృత్వంలోని ఆర్‌ఐ, జూనియర్ అసిస్టెంట్, మండల సర్వేయర్‌లతో కూడిన ఈ బృందాలు తమకు కేటాయించిన గ్రామాల్లో క్షేత్రస్థాయి పరి శీలన చేస్తున్నాయి. మ్యాప్‌లు, పాత భూరికార్డులతో గ్రామాలకు వెళుతున్న అధికారులు తమకు అందిన దరఖాస్తులను ప్రత్యక్షంగా విచారిస్తున్నారు. అయితే ఇందులో ఏ మేరకు సమస్యలు పరిష్కారమవుతాయి అనేది త్వరలోనే తేలనుంది.
రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు పరిశీలిస్తున్న కలెక్టర్ రాజర్షి షా (ఫైల్)
సర్వే నంబర్ మిస్సింగ్ 26
పెండింగ్ మ్యూటేషన్ 18
డిజిటల్ సైన్ పెండింగ్ 31
ఎక్స్‌టెన్షన్ కరెక్షన్స్ 106
ల్యాండ్ నేచర్ కరెక్షన్స్ 10
పట్టాదారు డిటేల్స్ కరెక్షన్స్ 110
నిషేధిత జాబితా నుంచి తొలగింపు 12
నిషేధిత భూమిలో చేర్చడం 08
అసైన్డ్ ల్యాండ్ 59
ఓఆర్‌సీ నాట్ ఇష్యూడ్ 05
38ఈ సర్టిఫికెట్ జారీ కానివి 01
సక్సేషన్ 131
ల్యాండ్ ఎక్విషన్ 01
ఇతర సమస్యలు 544
భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం
పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన భోరజ్ మండలంలో వివిధ భూ సమస్యలకు సంబంధించి 1067 దరఖాస్తులు అందాయి. వాటిని పరిష్కరించేందు కోసం సీనియర్ తహసీల్దార్లు , రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వారు ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి దరఖాస్తులపై ప్రత్యక్షంగా విచారణ చేస్తున్నారు. వివరాలు సేకరించి జూన్ 2లోగా వాటన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
– బి.వినోద్‌కుమార్, ఆర్డీవో, ఆదిలాబాద్
భోరజ్ మండలంలో వచ్చిన దరఖాస్తులు వివరాలిలా..


