
భూభారతితో సమస్యలు పరిష్కారం●
● కలెక్టర్ రాజర్షిషా
సాత్నాల: భూభారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భోరజ్ మండలంలోని పెండల్‌వాడ, హషింపూర్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. ఎలాంటి భూసమస్యలు ఉన్నా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించా రు. అలాగే మండలంలోని గూడ గ్రామంలో ని ర్వహించిన సదస్సుకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి హాజరయ్యారు. వచ్చిన 136 దరఖాస్తులను పరిశీలించారు. ఇందులో తహసీల్దార్ రాజేశ్వరి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.