
సైనికుల సేవలు చిరస్మరణీయం
ఆదిలాబాద్: భారత్–పాకిస్తాన్ సరిహద్దులో విధి నిర్వహణలో వీరమరణం పొందిన సైనికుల సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి జోగు రామ న్న అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన భారతీయులు, సరిహద్దుల్లో మరణించిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం వినాయక్ చౌక్‌లోని కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సైనికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇందులో సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, మజారుద్దీన్, వామన్‌రెడ్డి, రమేశ్, వినోద్, నాయకులు అలాల్ అజయ్, మెట్టు ప్రహ్లాద్, యూనుస్ అక్బానీ, కస్తాల ప్రేమల, చందాల రాజన్న, దాసరి రమేష్, సలీం పాషా, కొండ గణేశ్ తదితరులున్నారు.