
అదృష్టంగా భావిస్తున్నా
బోథ్: నాపేరు తక్కల స్వరూప. నాకు కుమారుడు, కూతురు ఉన్నారు. భర్త మృతిచెందిన కొంతకాలానికి కుమారుడు శైలన్ రెడ్డికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆర్మీలో విధులు నిర్వహించడం ఆనందంగా ఉంది. దేశం కోసం పోరాడే అవకాశం రావడం సంతోషంగా ఉంది.
బోథ్: నా పేరు కదం అనసూయ. నాకు ఐదుగురు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఆర్మీలో విధులు నిర్వహిస్తారు. రెండవ కుమారుడు ప్రవీణ్ కుమార్, మూడవ కుమారుడు ప్రతాప్‌లు ఆర్మీలో పనిచేస్తున్నారు. నా ఇద్దరు కుమారులు ఆర్మీలో విధులు నిర్వహించడం ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నా.
తానూరు: భోసికి చెందిన బాయి లక్ష్మి బాయి–భూమన్న దంపతుల కుమారుడు సాయినాథ్. 2004లో ఆర్మీలో ఉద్యోగం సాధించి విరమణ పొదాడు. తల్లి ఆశయం నెరవేర్చేందుకు 2024లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై నిజామాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి కల నేరవేర్చడంతో తల్లి సంతోషం వ్యక్తం చేస్తోంది. – లక్ష్మిబాయి
సంతోషంగా ఉంది.
నా కల నెరవేర్చాడు

అదృష్టంగా భావిస్తున్నా