
నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
● కలెక్టర్ రాజర్షి షా ● అధికారులతో సమీక్ష
కైలాస్‌నగర్: గ్రామాల్లో తాగునీటి సరఫరాలో సమ స్య తలెత్తకుండా చూడాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, గ్రౌండ్‌వాటర్ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నీటి సరఫరా కోసం చేపట్టిన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు 24 పనులు మంజూరు కాగా అందులో ఐదు పనులు పూర్తయ్యాయని మరో 11 పురోగతిలో ఉన్నాయని, 8 ప్రారంభం కాలేదని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి ముగిసేవరకు ప్రజలకు తాగునీటి సరఫరా లో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అవసరం ఉన్నచోట స్థానిక నీటి వనరులను, ట్యాంకర్లను వినియోగించుకోవాలని సూచించారు. మిష న్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంట్రా, గ్రిడ్, పంచాయ తీ, ఆర్‌డబ్యూఎస్ అధికారులు తమ శాఖల ప్రగతిని కలెక్టర్‌కు వివరించారు. ఇందులో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, సీపీవో వెంకట రమణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ చంద్రమోహన్, గ్రౌండ్‌వాటర్ ఏడీ శ్రీవల్లి, డీఈలు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యలు లేని
మండలంగా తీర్చిదిద్దాలి
సాత్నాల: పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న భోరజ్‌ను రెవెన్యూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సద స్సుకు హాజరై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధి కారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దరఖాస్తుల వెరిఫికేషన్ టీం ఇక అందుబాటులో ఉంటుందన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వరి, నలందప్రియ,రైతులు, తదితరులు పాల్గొన్నారు.
డెంగీ నిర్మూలనకు చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో డెంగీ నియంత్రణ కు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని కేఆర్‌కే కాలనీ బస్తీ దవాఖానాలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. కరపత్రాలు విడుదల చేశారు. టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. డెంగీ నివారణ, అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగీ నివారణ కు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఇందులో డీఎంహెచ్‌వో నరేందర్‌రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, టీబీ నిర్మూలన అధికారి సుమలత, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.