
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: నీతి ఆయోగ్ ఆస్పరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా నార్నూర్ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వర్షాలు కురిసేలోపు వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రీచార్జ్ స్ట్రక్చర్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాల పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పూడికతీతలో భాగంగా ఇంకా ప్రారంభం కాని చెరువుల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. కమ్యూనిటీ సోక్‌పిట్స్‌ను 63 గ్రామాలకు మంజూరు చేశామని వాటిని ప్రారంభించేలా చూడాలన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించి ప్రతి ఒక్కరూ నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సామ్.. మామ్ పిల్లల పురోగతి, ఐరన్ ఫోలిక్ మాత్రలు, ఫాంపాండ్, బోర్‌వెల్స్, తాగునీరు, పొలంబాట, ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఇందులో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, డీడబ్ల్యూవో మిల్కా, పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, బీఏఐఎఫ్ ఎన్జీవో ప్రతినిధులు సాయి, సుధాకర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.