
‘మహా’జొన్నలు రాకుండా తనిఖీలు
తలమడుగు: మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమంగా జొన్నలు రాకుండా పకడ్బందీ తనిఖీలు చే పడుతున్నట్లు వ్యవసాయాధికారి ప్రమోద్‌రెడ్డి తెలి పారు. గురువారం మండలంలోని లక్ష్మీపూర్ చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మ హారాష్ట్ర నుంచి కొందరు దళారులు తక్కువ ధరకు జొన్నలు కొనుగోలు చేసి ఆదిలాబాద్ మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర నుంచి అనుమతి లేకుండా జొన్నలు తరలిస్తే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్ష్మీపూర్ చెక్‌పోస్టుతోపాటు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు అనుమతి లేకుండా పత్తి విత్తనాలు తీసుకువెళ్లేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం చెక్‌పోస్ట్ సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.