
తప్పిపోయిన బాలుడి అప్పగింత
ఆసిఫాబాద్‌రూరల్: తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లికి శుక్రవారం అప్పగించినట్లు డీసీపీవో మహేశ్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి తప్పిపోయి దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలులో కాగజ్‌నగర్ రైల్వే పోలీసులకు పట్టుకుని, ఈనెల 9న జిల్లా కేంద్రంలో బాల రక్షభవన్‌కు అప్పగించారు. రక్షభవన్ సిబ్బంది బాలుడికి కౌన్సెలింగ్ నిర్వహించి మాట్లాడి వారి సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాగా గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించగా, తల్లి ఇక్కడకు రాగా, బాలుడిని అప్పగించినట్లు డీసీపీవో మహేశ్ తెలిపారు. సిబ్బంది శ్రావణ్, వ్రవీణ్ కుమార్, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.