‘ఆమె’కు అండగా.. | - | Sakshi
Sakshi News home page

‘ఆమె’కు అండగా..

May 15 2025 2:20 AM | Updated on May 15 2025 2:20 AM

‘ఆమె’కు అండగా..

‘ఆమె’కు అండగా..

● 8,439 సంఘాలు.. రూ.275 కోట్లు ● జిల్లా బ్యాంకు లింకేజీ రుణలక్ష్యం ఖరారు ● మండలాల వారీగా టార్గెట్లు నిర్దేశం ● మహిళల ఆర్థికాభ్యున్నతికి దోహదం

కైలాస్‌నగర్‌: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందజేస్తోంది. కుటీర పరిశ్రమల ఏర్పాటుతో పాటు వివిధ వ్యాపారాల్లో రాణించేలా బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఎస్‌హెచ్‌జీ సభ్యులు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం ఏటా రుణ లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని ఖరారు చేసింది. జిల్లాలోని 8,439 సంఘాలకు గాను రూ.275.50 కోట్లను బ్యాంకు లింకేజీ ద్వారా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేసి జిల్లాకు పంపించింది. దాన్ని సాధించే దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

అతివల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా..

అతివల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో సంఘానికి రూ. 2లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలు అందించనున్నారు. వీటితో కిరాణ, వస్త్ర దుకాణాలు, టైలరింగ్‌ యూనిట్లు, నాటు కోళ్లు, చేపల పెంపకం, కూరగాయల సాగు, పండ్ల విక్రయాలు, ఫుడ్‌ క్యాటరింగ్‌, ఆహార ఉత్పత్తుల తయారీ, టిఫిన్‌ సెంటర్ల నిర్వహణ వంటి పలు రకాల వ్యాపారాలతో ఉపాధి పొందనున్నారు. పురుషులతో సమానంగా మహిళలు రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో వారు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.

గతేడాది లక్ష్యానికి మించి రుణాలు..

2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను వందశాతానికి మించి సంఘాలకు రుణాలు అందజేశారు. జిల్లాలోని 8,993 సంఘాలకు గాను రూ.274.80 కోట్లను బ్యాంకు లింకేజీ కింద అందించేలా ప్రణాళిక ఖరారు చేశారు. అందులో 4,072 సంఘాలకు గాను రూ.285.50 కోట్ల రుణాలు అందజేశారు. లక్ష్యానికి మించి మరో రూ.10.70లక్షలు అందజేశారు. ఈ క్రమంలో గతేడాదితో పోల్చితే కొంత పెంచి ఈ సారి రుణ లక్ష్యం ఖరారు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో రూ.70లక్షలు అదనంగా సంఘాలకు అందజేయాలని నిర్ణయించారు.

జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు,

వాటికి కేటాయించిన నిధుల వివరాలు

మండలం స్వయం కేటాయించిన

సహాయక నిధులు

సంఘాలు (రూ.లక్షల్లో )

ఆదిలాబాద్‌రూరల్‌ 464 1,818.58

బజార్‌హత్నూర్‌ 477 1,644.29

బేల 518 1,676.62

భీంపూర్‌ 439 909.77

బోథ్‌ 785 2,674.45

గాదిగూడ 263 578.06

గుడిహత్నూర్‌ 501 1,608.23

ఇచ్చోడ 599 2,094.63

ఇంద్రవెల్లి 517 1,300.29

జైనథ్‌ 704 2702.69

మావల 88 289.23

నార్నూర్‌ 447 1276.44

నేరడిగొండ 569 1834.30

సిరికొండ 269 710.52

తలమడుగు 593 2,196.16

తాంసి 330 1,073.90

ఉట్నూర్‌ 876 3,162.49

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. రుణాలు పొందిన మహిళలు వ్యాపారాలు ప్రారంభించి స్వయం సమృద్ధి సాధించేలా ముందుకు సాగాలి. రుణ వడ్డీలు ఎప్పటికప్పుడు చెల్లించినట్‌లైతే కొత్త రుణాలు పొందేందుకు అవకాశముంటుంది. గతేడాది లక్ష్యానికి మించిఅందజేశాం. ఈ సారి కూడా కేటాయించిన లక్ష్యాలను వందశాతం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం.

– రాథోడ్‌ రవీందర్‌ ,డీఆర్డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement