తండ్రి మందలించాడని బలవన్మరణం
ఉట్నూర్‌రూరల్: తండ్రి మందలించాడని కుమారుడు బలవన్మరణం చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల మేరకు హస్నాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ సాయికిరణ్ (27) ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వారం రోజులుగా మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు. ఈ నెల 30న సాయంత్రం విధులకు వెళ్లే ముందు మద్యం సేవించి ఇంటికి రావడంతో తండ్రి రాథోడ్ బాపురావు మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్సకోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


