గాడిలో పడేనా?
నా పేరు మల్లెపూల పోతన్న. బోథ్ గ్రామం. ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేశాను. ఈ యాప్ ద్వారా మంచి ఉన్నది.. చెడు ఉన్నది.. మనకున్న వ్యవసాయ భూమి ప్రకారం ఎన్ని సంచుల యూరియా అవసరమో ఆ మేర బుక్ చేసుకుంటున్నారు. వినియోగానికి ఎంత అవసరమో అంతమేర ఇచ్చి మిగతా ఎప్పుడు వినియోగించాలో అప్పుడు ఇస్తున్నారు. అయితే మిగిలిన యూరియా తీసుకునేందుకు వెళ్లినప్పుడు తిరిగి బుకింగ్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఫర్టిలైజర్ ఉన్నది, లేనిది మనకు బుకింగ్ టైమ్‌లోనే తెలిసిపోతుంది. దాంతో షాప్‌కు వెళ్లి లైన్‌లో నిలబడే సమస్య ఉండదు. వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. డీలర్ దగ్గరికి వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు.


