‘నవోదయ’ ఏర్పాటుకు చర్యలు..
జిల్లాలో నవోదయ విద్యాలయంతో పాటు కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. ఎయిర్‌పోర్టు త్వరగా ప్రారంభమయ్యేలా చూస్తా. కొత్త రైళ్లు జిల్లా మీదుగా రాకపోకలు సాగేలా నా వంతు కృషి చేస్తా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతిఒక్కరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. – గొడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ
పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి
నియోజకవర్గంలో రెండేళ్లలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. నూతన సంవత్సరంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తా. అలాగే రైల్వేఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపడతా. ఎయిర్‌పోర్టు ప్రారంభమయ్యేలా చూస్తాను. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్‌కు కృషి చేస్తా. కొరటా–చనాఖా ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
‘నవోదయ’ ఏర్పాటుకు చర్యలు..
‘నవోదయ’ ఏర్పాటుకు చర్యలు..
‘నవోదయ’ ఏర్పాటుకు చర్యలు..


