‘సెర్ప్‌’ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

‘సెర్ప్‌’ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

May 10 2025 7:55 AM | Updated on May 10 2025 7:55 AM

‘సెర్ప్‌’ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

‘సెర్ప్‌’ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

● ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం ● మార్గదర్శకాల కోసం ఉద్యోగుల నిరీక్షణ ● నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం

జిల్లాలో సెర్ప్‌ ఉద్యోగుల వివరాలు

ఏడీఆర్డీవో: 01

డీపీఎంలు : 07

ఏపీఎంలు : 23

సీసీలు (ఎల్‌1, ఎల్‌2): 68

ఎంఎస్‌సీసీలు : 45

అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్లు : 06

ఆఫీస్‌ అసిస్టెంట్లు : 03

కై లాస్‌నగర్‌: సెర్ప్‌ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో అన్ని కేటగిరీల వారు ఉంటారని ఇటీవల ప్రత్యేక జీవో జారీ చేసింది. విధి విధానాలు ఖరారు చేసి త్వరలోనే మరో ఉత్తర్వు జారీ చేస్తామని అందులో స్పష్టం చేసింది. దీంతో ఏడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కలగనుంది. ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

ఏడేళ్లుగా తప్పని ఎదురుచూపులు

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సెర్ప్‌, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వంటి రెండు విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సెర్ప్‌ పరిధిలో పనిచేసే ఏపీడీలు, డీపీఎంలు, ఏపీవో పోస్టులకు జోనల్‌ స్థాయిలో, ఏపీఎంలు, సీసీలకు జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిలో ఏపీవో, ఈసీలు, టీసీ, డీఆర్పీ, డీడీ సీఎల్‌ఆర్‌సీ, డీబీటీ మేనేజర్‌, ప్లాన్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు జోనల్‌ స్థాయిలో, అలాగే టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు జిల్లాస్థాయిలో బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే మూడేళ్లకోసారి వీరికి కూడా బదిలీలు నిర్వహించాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే ఆయా విభాగాల్లో ఏడేళ్లుగా ఈ ప్రక్రియ నిర్వహించలేదు. దీంతో సదరు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ బదిలీ కోసం నిరీక్షిస్తున్నారు.

నిరీక్షణకు తెరపడే అవకాశం

సెర్ప్‌, ఈజీఎస్‌ ఉద్యోగులకు చివరిసారిగా 2018లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బదిలీల ప్ర క్రియ నిర్వహించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ వచ్చాక గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో అన్ని ప్రభుత్వ శా ఖల్లో బదిలీలు చేపట్టింది. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అ ధికారులు, ఉద్యోగులు ఆశపడ్డారు. డీఆర్డీఏ అధికా రులు కసరత్తు కూడా చేపట్టారు. అయితే ప్రభుత్వం వారి బదిలీలకు నాడు అవకాశమివ్వలేదు. అప్పటి నుంచి వారు మంత్రి సీతక్కతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తూనే ఉ న్నారు. వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీల ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు అందిన వెంటనే కౌన్సెలింగ్‌ నిర్వహించేలా జిల్లా గ్రామీ ణాభివృద్ధిశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా జిల్లాలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు స్థానచలనం కలగనుండగా ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశముంది. కొత్తగా ఏర్పడ్డ మండలాల్లోనూ పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ అయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఉపాధి హామీ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు.

నెలాఖరులోపు పూర్తయ్యే అవకాశం

సెర్ప్‌ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. త్వరలోనే మార్గదర్శకాలను ప్రకటింనుంది. వాటి ఆధారంగా ఈ నెలాఖరులోపూ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. ‘ఉపాధి’ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికి వారిని కూడా బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందే అవకాశముంది. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపడుతాం.

– రాథోడ్‌ రవీందర్‌, డీఆర్డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement