పోలీసుల కీర్తిని పెంచాలి
ఆదిలాబాద్‌టౌన్: పోలీసుల కీర్తిని మరింత పెంచేలా నూతనోత్సాహంతో పనిచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అధికారులు ఎస్పీకి పుష్పగుచ్ఛాలు, పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూత న సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బాధ్యతగా విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఎస్పీ మౌనిక, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, కార్యాలయ ఏవో భక్తప్రహ్లాద, సీఐలు, ఎస్సైలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది, ఎన్‌ఐబీ, స్పెషల్ బ్రాంచ్, ఫింగర్ ప్రింట్, డీసీఆర్బీ, ఐటీ కోర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


