కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ
కైలాస్‌నగర్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు జిల్లాస్థాయి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల ప్రతినిధులు కలెక్టర్ రాజర్షి షాను గురువారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు, బ్లాంకెట్లు, నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, పెన్నులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, ఎస్.రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ప్రభుత్వ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రావు, బీసీ, ఎస్సీ సంక్షేమాధికారులు కె.రాజలింగు, సునీతాకుమారి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, కలెక్టరేట్ ఉద్యోగులు, టీఎన్జీవోస్, టీజీవోస్ సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, రిటైర్డ్ ఎంప్లాయీస్, మీడియా ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసినవారిలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు సామ రూపేశ్‌రెడ్డి కలెక్టర్‌కు బేల మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, సాంగిడి గ్రామస్తులతో కలిసి 400 నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి కేక్ కట్ చేసిన కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. తహసీల్దార్ల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన డైరీ, క్యాలెండర్లు ఆయా సంఘాల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.


