అక్రమాలకు పచ్చ జెండేనా.. | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు పచ్చ జెండేనా..

Jan 2 2026 11:15 AM | Updated on Jan 2 2026 11:15 AM

అక్రమ

అక్రమాలకు పచ్చ జెండేనా..

సర్వే భూరికార్డుల శాఖలో అవినీతి మోసానికి పాల్పడ్డ ‘రియల్‌’ ముఠా అక్రమార్కులకు అండగా సర్వేయర్‌ ఎన్నో ఏళ్లుగా జిల్లా కేంద్రంలోనే తిష్ట నిందితుడిపై శాఖాపరమైన చర్యలేవి? రెండునెలల్లో తిరిగి యథా స్థానానికి..

సాక్షి, ఆదిలాబాద్‌: సర్వేయర్‌ శివాజీ.. ‘రియల్‌’ ముఠా భారీ మోసం, కుంభకోణం కేసులో నింది తుడు. రెండు నెలల కిందట జిల్లాలో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసును పరి శీలిస్తే.. భూ మాఫియాలో ప్రభుత్వ అధికారులు, ఉ ద్యోగులు ఎలా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారో తెలిసిపోతుంది. ఈ కుంభకోణంలో ఏ9గా ఉన్న సర్వే, భూ రికార్డుల శాఖలో పని చేసే సర్వేయ ర్‌ శివాజీని పోలీసులు అరె స్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా అతనిపై శాఖా పరమైన చర్యలు తీసుకోలేదు. పైగా రెండు నెలలు తిరగకుండానే అతడు తిరిగి ఆదిలాబాద్‌లోనే పోస్టింగ్‌ సాధించి విధుల్లో చేరడం గమనార్హం.

ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్‌లోనే..

సర్వేయర్‌ శివాజీ ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్‌లోనే విధులు నిర్వహిస్తున్నాడు. గత సాధారణ బదిలీల్లో నిజామాబాద్‌కు వెళ్లినా వెంటనే సెలవు పెట్టి సుమారు ఏడాదిగా కొనసాగుతున్నాడు. గతంలో ఆయన ఆదిలాబాద్‌లో పనిచేసినప్పుడు జరిగిన ఒక భూకుంభకోణానికి సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పై గత అక్టోబర్‌లో జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. 10మందిపై కేసు నమో దు చేయగా ఏ9గా శివాజీని నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో అతడిని రిమాండ్‌కు తరలించారు. సాధారణంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి రిమాండ్‌లో ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. శివాజీ నిజామాబాద్‌లో పోస్టింగ్‌ ఉండటం, లీవ్‌లో కొనసాగుతుండడంతో ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్‌, నిజామాబా ద్‌లోని ఆ శాఖ అధికారులు అతడిపై ఉన్నతాధికా రులకు నివేదిక పంపలేదా? అనే అనుమానాలు వ్య క్తమవుతున్నాయి. లేని పక్షంలో ఈ వ్యవహారాన్ని ఆయన మేనేజ్‌ చేసుకున్నాడా? అనే సందేహాలు న్నాయి. ఇలా లీవ్‌లో కొనసాగుతున్న అతడిని కమి షనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేయగా, తాజాగా అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు పోస్టింగ్‌ తెచ్చుకుని గురువారం విధుల్లో చేరాడు. అతడిపై శాఖాపరమైన చర్యలు లేకపోగా, ఎక్కడైతే అక్రమాలకు పాల్పడ్డాడో తిరిగి అక్కడికే పోస్టింగ్‌ ఇవ్వడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కేసు వివరాలు ఇలా..

జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారికి సంబంధించి ఈడీ అధీనంలో బ్యాంక్‌ మార్టిగేజ్‌ పరిధిలోగల భూమిని కబ్జా చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని అక్టోబర్‌ 12న జిల్లా పోలీసులు 10మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో బడా వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులున్నారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సర్వేయర్‌ శివాజీ కూడా ఈ కేసులో నిందితుడు. మొదట్లో అతడు అరెస్ట్‌ కాకుండా తప్పించుకుంటూ వచ్చా డు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమిని కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తిరిగి విక్రయించారు. దీంట్లో నకిలీ సేత్వార్‌ తయారు చేయడంతోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు రూ.కోట్ల విలువైన స్థలం తిరిగి విక్రయించేందుకు వీలైందనే ఆరోపణలున్నాయి. దీంట్లో సర్వేయర్‌ పాత్ర ఉండటంతోనే ఆయనను నిందితుడిగా చేర్చారు. కాగా, ఆదిలాబాద్‌లో ఇటీవల అనేక భూ అక్రమాలకు సంబంధించి పోలీసులకు పెద్ద ఎత్తున ఫి ర్యాదులు వచ్చాయి. దీంట్లో సర్వే, భూ రికార్డుల శాఖ నుంచి కూడా అక్రమాలకు వెన్నుదన్నుగా ఉద్యోగులు నిలుస్తున్నారని పోలీసుల దృష్టికి వ చ్చింది. దీంతో సర్వేయర్‌పై కేసు నమోదు చేశా రు. ప్రధానంగా ఆదిలాబాద్‌ పట్టణం చుట్టుపక్కలున్న అనేక అసైన్డ్‌, అటవీ, చెరువు, శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. పట్టా భూములు నామమాత్రంగా ఉండగా, వాటి సమీపంలోని ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి రియల్టర్లు అన్యాక్రాంతం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి రెవెన్యూ, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు సహకరించడంతోనే ఈ దందా దశాబ్దాలుగా యథేచ్ఛగా కొనసాగుతూ వస్తుందనేది పట్టణవాసులందరికీ తెలిసిందే. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేసే అధికా రులు, ఉద్యోగులు ఇలా విలువైన స్థలాలను అ న్యాక్రాంతం చేయడంలో రియల్టర్లకు సహకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వేయర్‌ శివాజీని తిరిగి ఆదిలాబాద్‌లోనే నియమించడంపై ఆ శాఖ ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో వివరణ కోరేందుకు అడిషనల్‌ కలెక్టర్‌ శ్యామలాదేవిని, కొత్తగా విధుల్లో చేరిన సర్వే భూ రికార్డుల శాఖ జిల్లా ఏడీ ప్రభాకర్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

అక్రమాలకు పచ్చ జెండేనా..1
1/2

అక్రమాలకు పచ్చ జెండేనా..

అక్రమాలకు పచ్చ జెండేనా..2
2/2

అక్రమాలకు పచ్చ జెండేనా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement