సోయా కొనుగోలు చేయాలి
ఆదిలాబాద్: జిల్లా రైతులు పండించిన సోయా పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్‌తో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితుల్లో దిగుబడి తగ్గి సోయా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వచ్చిన కాస్త దిగుబడినైనా ఎ లాంటి షరతులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.


