ఇక ‘ట్రెజరీ’ చెల్లింపులు
ఈజీఎస్ నిబంధనల్లో మార్పులు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం పారదర్శకతకు అధిక ప్రాధాన్యం చెల్లింపుల్లో జాప్యం జరగొద్దనే.. ఈ ఏడాది నుంచే అమలులోకి..
కై లాస్‌నగర్: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనుల బిల్లుల చెల్లింపుల్లో కేంద్రం మార్పులు చేసింది. అక్రమాలను కట్టడి చేయడంతో పాటు పారదర్శతకు పెద్దపీట వేసేలా ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేపట్టేందుకు నిబంధనలు రూపొందించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది నుంచి చేపట్టనున్న ఉపాధిహామీ పనుల బిల్లులతో పాటు ఉద్యోగులు, సిబ్బంది వేతనాలను ఇక నుంచి ట్రెజరీ ద్వారానే చెల్లించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తేనే కేంద్రం నిధులు విడుదల చేసేలా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. దీంతో బిల్లులు, వేతనాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యానికి చెక్ పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సకాలంలో చెల్లింపులు చేసేందుకే..
ఉపాఽధిహామీ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్నారు. వాటికి సంబంధించిన వివరాలను స్పార్ష్ మాడ్యూల్‌లో నమోదు చేసేలా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులకు ఉపయోగించిన మెటీరియల్, కూలీల పనుల వివరాలను ట్రెజరీ శాఖకు అందించనున్నా రు. జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, అటవీ, ఐటీడీఏ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న పనులన్నింటికీ ఈ నూతన విధానం అమలుకానుంది. ట్రె జరీ అధికారులు బిల్లులను ఆమోదించాక పైనాన్షి యల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు వాటా వివరాలు పంపిస్తారు. అక్కడి అఽధికారులు పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం వాటికి సంబంధించి నిధులు విడుదల కానున్నాయి. మెటీరియల్ కంపోనెంట్ బిల్లులతో పాటు ఉపాధిహామీలో పనిచేసే ఏపీవో లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పీల్డ్ అసిస్టెంట్లు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది వేతనాలనూ ఇక నుంచి ట్రెజరీ ద్వారా చెల్లించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరి వేతనాలు సర్కారు ట్రెజరీకి పంపించి వేతనాలను జమ చేస్తోంది. అయితే నూతన విధానంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సబ్ ట్రెజరీల వారీగా వారికి వేతనాలు అందనున్నాయి. బిల్లుల చెల్లింపులు కూడా ఇలాగే జరగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఒకేసారి విడుదల కానుండటంతో వారు వేతనాల కోసం ఇక నుంచి నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండదు. సకాలంలో వేతనాలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే అవకాశముందనే అభిప్రాయాన్ని ఆ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వాటా విడుదల చేస్తేనే..
ఇప్పటివరకు ఉపాధిహామీ పనులకు సంబంఽధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేయకు న్నా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వ చ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదలలో తీవ్ర జాప్యం చేసేది. దీంతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమయ్యేది. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండకూడదని భావించిన కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర ప్ర భుత్వ వాటాను ముందు విడుదల చేశాకే తన వాటాను విడుదల చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులకు సంబంధించిన వాటాలను ఒకేసారి విడుదల చేయనుండటంతో వాటి చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యానికి ఇక నుంచి చెక్‌పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మార్గదర్శకాలకు అనుగుణంగానే..
ఉపాధిహామీ బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే బిల్లులను ట్రెజరీ ద్వారా చెల్లించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే జిల్లాలో చర్యలు తీసుకుంటాం. ఈ నిర్ణయంతో ఉపాధి ఉద్యోగులు, సిబ్బంది వేతనాల కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. బిల్లులు కూడా త్వరగా విడుదలయ్యే అవకాశముంది.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో


