
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తారని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభోజు గోపీకృష్ణ అన్నారు. ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి టాపర్లుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులను సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. బంగా రుగూడ మోడల్ స్కూల్ విద్యార్థి చిల్కూరి రమ(578 మా ర్కులు), జెడ్పీఎస్‌ఎస్ కజ్జర్ల విద్యార్థి గిజ్జ అ నుశ్రీ (576 మార్కులు), బంగారుగూడ మోడ ల్ స్కూల్ విద్యార్థి సట్లావార్ హరీష్(575మార్కులతో) టాపర్లుగా నిలిచా రు. వారిని శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలు అందజేసి అభినందించారు. మున్ముందు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం మహిళా అధ్యక్షురాలు జీజాబాయి, కప్పర్ల పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఆనంద్, బంగారుగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజశేఖర్, విశ్రాంత అధ్యాపకులు విజయబాబు, తపస్ నాయకులు కృష్ణ సాగర్, గోపీచంద్, గంభీర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.