
● గూడ్స్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం ● అదుపుతప్పి బోల్
●
గతేడాది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ నిర్మల్ ఘాట్ సెక్షన్ సమీపంలో బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, ఓవర్ లోడ్ కారణంగా ఓ ప్రయాణికుడు మృత్యువాత పడగా, అందులో ప్రయాణిస్తున్న 25 మంది గాయాల పాలయ్యారు.
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో రహదారి ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. శుభకార్యాలు, దైవదర్శనం, ఇతర పనుల నిమిత్తం గూడ్స్ వా హనాల్లో వెళ్తున్న సమయంలో అతివేగం, డ్రైవర్ ని ర్లక్ష్యం, మద్యం మత్తులో నడపడం, పరిమితికి మించి వెళ్లడంతో వాహనాలు బోల్తా పడుతున్నాయి.ఈ ఘటనల్లో అందులో ప్రయాణిస్తున్న వారి లో పలు వురు మృతిచెందగా,మరికొంతమంది తీవ్ర గాయా లై కోలుకోలేని స్థితికి చేరుకుంటున్నారు. కుటుంబ పెద్దలను కోల్పోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది తెలిసి ఇలాంటి ప్రయాణాలు చేస్తుండగా, మరికొందరు అవగాహ న లేకపోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా గూడ్స్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రవాణా శాఖాధికారుల నిర్లక్ష్యమో, అలసత్వమో ఏమోగానీ ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్ర మాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తప్పా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టకపోవడంతో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా..
నిబంధనల ప్రకారం గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలించరాదు. అయితే కొంతమంది యజ మానులు శుభకార్యాలు, దైవదర్శనాలు ఇతర పను ల నిమిత్తం గూడ్స్ వాహనాల్లో తరలిస్తున్నారు. ఘా ట్ సెక్షన్లు, మూలమలుపుల వద్ద అతివేగం కారణంగా వాహనాలు బోల్తా పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు క్షతగాత్రులుగా మారుతుండగా, మరి కొంత మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఐచర్, బొలెరో, లారీలు, టాటాఏస్, ఆటో ట్రాలీ వంటి వాహనాల్లోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.
గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు..
గూడ్స్‌వాహనాలతో పాటు ఆటోలు, జీపుల్లో పరిమి తికిమించి ప్రయాణికులను తరలిస్తున్నారు. ఇచ్చో డ, బజార్‌హత్నూర్, సిరికొండ, సాత్నాల, నేరడిగొండ, తదితర ప్రాంతాల్లో జీపులు, ఆటోల్లో పరి మితికి మించి ప్రయాణా లుసాగిస్తున్నారు. గతంలో బోథ్, తలమడుగు మండలంలో, ఇచ్చోడ సమీపంలో ఆటోలు బోల్తా పడడం, రోడ్డు ప్రమాదాలకు గురికావడంతో పలువురు మృతిచెందారు.
సిరికొండ మండలంలోని నేరడిగొండ(జి) వద్ద శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో మూలమలుపు వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 30 మందిలో 11 మంది గాయాలపాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది.
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

● గూడ్స్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం ● అదుపుతప్పి బోల్

● గూడ్స్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం ● అదుపుతప్పి బోల్