
‘లంబాడీలపై సవతి తల్లి ప్రేమ’
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలో లంబాడీలపై రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు భరత్ చౌహాన్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని విజయ్‌నగర్ కాలనీ సేవాలాల్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడీలకు కులధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు అధికారులు ఇష్టారీతిన నిబంధనలు విధించడం సరికాదని పేర్కొన్నారు. భవిష్యత్‌లో లంబాడీలపై వివక్ష చూపిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పాక్స్ చైర్మన్ అడే సురేశ్, సేవాలాల్ మహరాజ్ ఉత్సవ సమితి ఉట్నూర్ అధ్యక్షుడు జాదవ్ మధుకర్, నాయకులు అడే డిగంబర్, కై లాస్‌నాయక్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.