
సర్కారు బడుల్లోనే చేర్పించాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అందులోనే చేర్పించాలి. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు 97శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో 58 బడుల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన అందిస్తున్నాం. మరింత నాణ్యమైన బోధన అందించేందుకు ఐదు రోజుల పాటు వారికి శిక్షణ కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టారు.
– ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో