
● జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు కమిటీ తీ
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్‌మెంట్ టెండర్ల వ్యవహారంలో ఉపాధికల్పన శా ఖ, ఏజెన్సీల గు ర్తింపు కమిటీ తీ రుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దరఖాస్తు ఫీ జు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఉండేది. ఈ ఎండీ రూ.2లక్షలుండే ది. తాజా టెండర్లలో ఎ న్నో రెట్లు అధికంగా నిర్ధారించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా ఉపాధికల్పన అ ధికారి మెంబర్ కమ్ కన్వీనర్‌గా, కోశాధికారి, లేబర్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు ఫీజు, ఈఎండీ పెంపునకు సంబంధించి నిర్ణయం కమిటీ తీసుకున్నదా.. ఉపాధికల్పన శాఖ నుంచి దీన్ని రూపొందించారా.. అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఈఎండీ రూ.5లక్షలా?
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శా ఖల్లో అవుట్‌సోర్సింగ్ స ర్వీసులు ఏర్పాటుకు కొ త్త ఎంప్యానల్‌మెంట్ కు నమోదిత ఏజెన్సీల నుంచి ఈనె ల 2నుంచి 13వర కు జిల్లా ఉపాధికల్పన కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. టెండర్ నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫారం కో సం రూ.10వేల డీడీ చెల్లించి ఆఫీసులో తీసుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. ఈఎండీ ఎంత చెల్లించాలనే విషయాన్ని దరఖాస్తులో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇటీవల ఓ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు డీడీ చెల్లించి దరఖాస్తు ఫారం తీసుకున్నాడు. దాంట్లో రూ.5లక్షల ఈఎండీ దరఖాస్తు ఫారంతో పాటు జతచేసి ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొనడంతో నిర్ఘాంతపోయాడు. అసలు ఇంత పెద్దమొత్తంలో ఈఎండీ చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొని ఉంటే దరఖాస్తు ఫారం కొనుగోలు చేసేవాడిని కాదని లబోదిబోమంటున్నాడు.
అడ్డగోలు నిబంధనలెలా?
టెండర్ నోటిఫికేషన్‌లో ఈఎండీ ప్రస్తావన లేదు. దరఖాస్తు ఫారం కొన్న తర్వాత అందులో ఈఎండీ ప్రస్తావన, అడ్డగోలు నిబంధనలున్నాయి. ఈఎండీ కోసం రూ.5లక్షలు చెల్లించలేని పరిస్థితుల్లో ఆ ఏజెన్సీ నిర్వాహకుడు దరఖాస్తు ఫారం కోసం చెల్లించిన రూ.10వేలు నష్టపోవాల్సి వస్తోంది. రూ.కోటి టర్నోవర్ రెండేళ్లలో కలిగి ఉండాలని, అది కూడా గడిచిన మూడేళ్లదే పరిగణనలోకి తీసుకోనున్నట్లు దాంట్లో పేర్కొన్నారు. ఇదివరకు 100 మంది ఉద్యోగుల నిర్వహణ చేసిన అనుభవం కలిగి ఉండాలని వివరించారు. ఏజెన్సీ ఎంపికైన తర్వాత ఏదైన శాఖ లో అవుట్‌సోర్సింగ్ నిర్వహణ కల్పించినప్పుడు ఉ ద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ ముందుగానే ఒకనెల వేతనాల డబ్బులను డిపాజిట్ చేయాలని దాంట్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలన్నీ దరఖాస్తు ఫారంలో పేర్కొని ఉండాల్సిందనే అభిప్రాయం ఏజెన్సీ నిర్వాహకులు వ్యక్తంజేస్తున్నారు.
కొన్ని ఏజెన్సీలకు మేలు చేసేందుకే..
ఇతర జిల్లాల్లోనూ ఇలాగే..
జీవోలో ఈ నిబంధనలు లేకపోయినా ఇతర జిల్లాల్లో కొనసాగుతున్న విధానాన్నే మేము ఫాలో అయ్యాం. అక్కడ లేని అభ్యంతరాలు ఇక్కడే ఎందుకు. జిల్లా అవుట్‌సోర్సింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాల మేరకే వీటిని అమలు చేస్తాం. – మిల్కా,
జిల్లా ఇన్‌చార్జి ఉపాధికల్పన అధికారి
జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కొన్ని ఏజెన్సీలకు మేలు చేసేందుకే కొత్త ఎంప్యానల్‌మెంట్ ఏర్పాటులో ఇలా అడ్డగోలు నిబంధనలు రూపొందించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2006లో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్‌టీ నంబర్ 4459 ప్రకారమే వెళ్తున్నామని అధికారులు చెబుతుండగా, దాంట్లో ఈఎండీ, ఇతర నిబంధనలు ఇలా రూపొందించాలని లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న కొన్ని ఏజెన్సీలకు మేలు చేసేలా జిల్లా అధికారులు కుయుక్తులకు పాల్పడుతున్నారని వారు నేరుగా ఆరోపిస్తున్నారు.

● జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు కమిటీ తీ