
సమాజంలో ప్రతీ ఒక్కరికి ఓ పేరు ఉంటుంది. ఇందులో ఇంటి పేరు
– ఆదిలాబాద్
తెలంగాణ కిరణ్
నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి వెళ్లి కుంట కిరణ్ కుమార్‌రెడ్డి ఇల్లు ఎక్కడ అని అడిగితే గుర్తుపట్టేవారు తక్కువే. అదే తెలంగాణ కిరణ్ అంటే మాత్రం టక్కున చెబుతారు. గ్రామంలో ఈయన చిన్నప్పటినుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. పలు నిరసన కార్యక్రమాల్లో ముందుండి నినదించాడు. ఈ క్రమంలోనే ఈయన పేరు కాస్తా తెలంగాణ కిరణ్‌గా మారిపోయింది. 2001 నుంచి 2014 వరకూ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వడమే తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చిందని సంతోషంగా చెబుతున్నాడు కిరణ్‌కుమార్‌రెడ్డి.