
పత్రిక స్వేచ్ఛపై దాడి
కై లాస్‌నగర్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఏపీ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేయించడాన్ని ఆదిలాబాద్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీ లు ధరించి ప్రెస్‌క్లబ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వా రం ఎదుట ధర్నా చేశారు. ఏపీ ప్రభుత్వానికి, పోలీ సులకు వ్యతిరేకంగా నినదించారు. ఈసందర్భంగా సాక్షిపత్రిక స్టాఫ్ రిపోర్టర్ గొడిసెల కృష్ణకాంత్‌గౌడ్, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.సురేశ్, టీయుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, ఎడిటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ మాట్లాడారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులతో తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురిచేయడం పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు అణచివేత వైఖరి అవలంభించడం దుర్మార్గమమని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతా మని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో బి.వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో ప్రెస్‌క్లబ్ కన్వీనర్ వై.సుధాకర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సారంగపాణి, సత్యనారాయణ, సందేశ్, వినోద్, వెంకటేశ్, రాజేష్, రాజేశ్వర్, రవి, ప్రవీణ్, సుభాష్, శ్రీకాంత్, నీలేష్, అభిలాష్, విజ య్‌రెడ్డి, మహేష్, సతీశ్‌రెడ్డి, అరుణ్‌రెడ్డి, మహేందర్, శ్రీనివాస్, పవన్, దీపక్, నరేష్, జైపాల్, అశోక్, రాజు, అస్మత్, రాకేశ్, నర్సింగ్, రాము, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ పోలీసుల తీరుపై జర్నలిస్టుల ఆందోళన
కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన

పత్రిక స్వేచ్ఛపై దాడి