
ఇంకుడుగుంతలు.. మరుగుదొడ్లు
కై లాస్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్(ఎస్‌బీఎం) ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ.17.06 కోట్ల నిధులను ఆ విభాగానికి కేటాయించింది. వాటి ద్వారా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఏడాది లోపు పూర్తిచేసేలా మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్దూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశా రు. తదనుగుణంగా పనులు ప్రారంభించే దిశగా అఽ దికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మింపజేసేలా ప్రజలను చైతన్యవంతులు చేయడంతో పాటు ఇంకుడుగుంతలు నిర్మించేలా అధికారులు ముందుకు సాగుతున్నారు.
స్వచ్ఛత.. పరిశుభ్రతే లక్ష్యం
ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. తద్వారా పరిశుభ్రతతో పాటు వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలు పునరుద్ధరించే దిశగా నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. వీటి నిర్మాణాలకు రూ.12వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది. అ లాగే మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో కమ్యూనిటీ టాయ్‌లెట్స్‌కు రూ.3లక్షల చొ ప్పున వెచ్చిస్తోంది. అలాగే భారీ కమ్యూనిటీ సోక్‌పి ట్స్ సైతం చేపట్టనున్నారు. గ్రామాల్లో పోగైన చెత్త ను సేకరించి సెగ్రిగేషన్ చేసేందుకు వీలుగా షెడ్లను నిర్మించనున్నారు. జిల్లాలో కొత్తగా ఐదు గ్రామ పంచాయతీలు ఏర్పడగా తలమడుగు మండలంలోని పూనగూడ, ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మగూడలో వీటిని నిర్మించాలని ప్రతిపాదించారు. వీటితో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకోసం ఈ సారి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై కేంద్రం దృష్టి సారించింది. జిల్లాలో తొలిసారిగా మూడు యూ నిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో యూనిట్‌కు రూ.64లక్షల చొప్పున కేటాయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో నిర్మించాలని భావిస్తున్నారు.
కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలి ..
వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలనే ఆసక్తి గల కుటుంబాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి మంజూరు చేస్తారు. నిర్మాణాలు పూర్తయ్యాక రూ.12వేల చొప్పున నిధులు మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అలాగే కమ్యూనిటీ టాయ్‌లెట్స్, సోక్‌పిట్స్ నిర్మాణాలను ఎక్కడ చేపట్టాలనే దానిపై ఎంపీడీవోలు నిర్ణయించనున్నారు. అందుకు ప్రభుత్వ స్థలాలు అవసరమున్నందున రెవెన్యూ అధికారులతో కలిసి వాటిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. బహిరంగ మల విసర్జన రహితంగా గ్రామాలను తీర్చిదిద్దడంతో పాటు నీటి వనరులు సంరక్షించేదిశగా నిర్మాణాలు సాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
స్వచ్ఛభారత్ మిషన్ వార్షిక లక్ష్యం ఖరారు
జిల్లాకు రూ.17.06 కోట్ల నిధులు
పనుల ప్రారంభానికి అధికారుల కసరత్తు
ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌లో ఓ కుటుంబం తమ ఇంటి వద్ద ఎస్‌బీఎం నిధులతో నిర్మించుకున్న ఇంకుడుగుంత ఇది. వర్షపునీటిని సంరక్షించి బోరులో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు దోహదపడుతుంది.
ఇక్కడ కనిపిస్తున్న చేదబావి నీరు వృథాగా పోకుండా చూడటంతో పాటు వర్షపునీటిని ఒడిసిపట్టేలా చేపట్టిన కమ్యూనిటీ ఇంకుడుగుంత ఇది. ఇచ్చోడ మండలం ముఖరా (కే)లో నిర్మించారు. భూగర్భజలాలు పెంపొంది బావిలో నీటి ఎద్దడి తలెత్తకుండా దోహదపడుతుంది. రూ.94వేల వ్యయంతో దీన్ని నిర్మించుకోవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి
వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేనటువంటి వారికి ఎస్‌బీఎం మంచి అవకాశం. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలి. అలాగే కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు తప్పనిసరిగా ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మించుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వాటి నిర్మాణాలు చేపట్టాలి.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో
కంపోనెంట్ యూనిట్లు నిధులు (రూ.లక్షల్లో )
వ్యక్తిగత మరుగుదొడ్లు 5,573 668.76
కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ 14 29.4
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ 03 192.00
కమ్యూనిటీ మరుగుదొడ్లు 5,522 358.93
డ్రెయిన్ల చివరన ఇంకుడుగుంతలు 376 348.73
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడుగుంతలు 47 43.59
సామాజిక ఇంకుడుగుంతలు 393 49.41
సెగ్రిగేషన్ షెడ్లు 02 3.00

ఇంకుడుగుంతలు.. మరుగుదొడ్లు

ఇంకుడుగుంతలు.. మరుగుదొడ్లు