
ఆరోగ్య పాఠశాలతో విద్యార్థుల్లో మార్పు
● కలెక్టర్ రాజర్షిషా ● ‘పది’లో సత్తా చాటిన విద్యార్థులకు సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పులు వచ్చాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పదో తరగతిలో ఉత్తమ మా ర్కులు సాధించిన విద్యార్థులను జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిందన్నారు. రాష్ట్రస్థాయిలో 97.18 శాతం ఉత్తీర్ణతతో 9వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని కొనియాడారు. ఇందులో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్, డీసీఈబీ సెక్రెటరి గజేందర్ తదితరులు పాల్గొన్నారు.