
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
ఆదిలాబాద్: ఈ నెల 20న దేశవ్యాప్తంగా ని ర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి దేవేందర్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ జిల్లా కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని సంఘటి త, అసంఘటిత రంగాల కార్మికులంతా పా ల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో ఖాసీం, అఫ్రోజ్, మహేందర్, సలీం, జమీల్ తదితరులు పాల్గొన్నారు.