
శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రావీణ్యం
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రావీణ్యం లభిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధి విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని అన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో నాలుగు చోట్ల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్‌లలో వీటిని ప్రారంభించినట్లు చెప్పారు. నాలుగు కేంద్రాల్లో 470 మంది విద్యార్థులకు యోగా, కరాటే, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్ తదితర కీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. అలాగే పోలీసు స్టేషన్ల సందర్శన, సిబ్బంది విధుల నిర్వహణ, జైలు సందర్శన, ఆయుధాల ఉపయోగం, వాటి పనితీరు, పోలీసులు తీసుకుంటున్న కఠోర శిక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, వెంకటి, చంద్రశేఖర్, శిక్షకులు పాల్గొన్నారు.
బోథ్ పోలీస్ స్టేషన్ తనిఖీ
బోథ్:అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయా లని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీ స్‌స్టేషన్‌ను సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాల ని సిబ్బందికి సూచించారు. డయల్ 100, బ్లూకోర్ట్ సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ సమాచార సేకరణలో ముందుండాలని సూచించారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై ప్రవీణ్ ఉన్నారు.

శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రావీణ్యం