
కానిస్టేబుల్‌గా ఉంటూనే ప్రిపేరయ్యా..
– బి.సంజయ్‌కుమార్,ఎస్‌హెచ్‌వో,ఇచ్చోడ
కుటుంబ నేపథ్యం: సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని ఇత్వర్‌పేట్. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న భూదేవి– చిన్నగంగారాం.
విద్యాభ్యాసం..: ఏడో తరగతి వరకు ఊరి లోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. బాల్కొండలోని సర్కారు బడిలో టెన్త్ వరకు చదివా. ఇంటర్ ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశా. బీటెక్ హైదరాబాద్‌లో పూర్తయింది.
లక్ష్యసాధన: బీటెక్ పూర్తి కాగానే ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. నిజామాబాద్‌లో విధులు నిర్వర్తిస్తూనే ఎస్సై కోసం ప్రిపేర్ అయ్యా. నాలుగేళ్ల తర్వాత నా కల ఫలించింది.
సమాజంలో మీరు కోరుకునే మార్పు.. : అందరికీ సమన్యాయం దక్కాలి. అందుకోసం నావంతు కృషి చేస్తా. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సమాజ పరిస్థితులపై అవగాహన ఉంది.
నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: కష్టపడితే ఫలితం దక్కుతుంది. అందుకు నేనే ఉదాహరణ.